గురువారం నుంచి హైదరాబాద్ లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ప్రాజెక్ట్ ను హుస్సేన్ సాగర్ చుట్టు ప్రయోగాత్మకంగా చేపట్టారు.
ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ మార్గంలో 10 కిలోమీటర్ల మార్గం వరకు 30 నిముషాలు వైఫైని ఉచితంగా వినియోగించుకోవచ్చు.
ఉచిత వైఫై సేవలను గురువారం సాయంత్రం ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.అనంతరం ఈ సేవలను నగరమంతటా విస్తరించనున్నారు.
సుమారు 1800 నుంచి 2500 మంది ఏకకాలంలో వాడుకునేలా BSNL ఏర్పాట్లు చేసింది.
క్వాడ్ జెన్ సంస్థతో కలిసి అందిస్తున్న వైఫై 2 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్ వేగంగా పనిచేస్తుందని అధికారులు అంటున్నారు.
No comments:
Post a Comment