Radio LIVE


Breaking News

Thursday, 16 April 2015

భార్యపై కోపంతో అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు

భార్యపై కోపంతో ఆమె భర్త అత్తారింటికి నిప్పు పెట్టాడు.ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో జరిగింది. పోలిసుల కథనం ప్రకారం.. షియోవూర్ జిల్లా తెంతరా గ్రామానికి చెందిన రామ్ లాల్ తో భోపాల్ కి 300KM దూరంలో ఉన్న మనియార్ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళకు వివాహం జరిగింది.భర్త మరియు అతడి కుటుంబసభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని లక్ష్మి పుట్టింటికి వచ్చేసింది. దీంతో లక్ష్మిపై కోపంతో ఉన్న ఆమె భర్త , అతడి సోదరులతో కలిసి లక్ష్మి పుట్టింట్లో ఉండగా వారి ఇంటికి తాళం వేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు.దీంతో లక్ష్మితో సహా ఇంట్లో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని, లక్ష్మి70% కాలిన గాయాలతో గ్వాలియర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates