Radio LIVE


Breaking News

Friday, 17 April 2015

‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన రాజేంద్రప్రసాద్

గత రెండు నెలలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎన్నడూ లేని విధంగా గతనెల 29 న నటకిరీటి రాజేంద్రప్రసాద్, సహజనటి జయసుధ పోటీ పడ్డారు. పేద కళాకారుల కోసం ఒకరిని మించి ఒకరు హామీలు కురిపించారు.
ఇరువురి ప్యానెళ్ల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కూడా సాగాయి.ఈ క్రమంలో నటుడు కళ్యాణ్ ‘మా’ ఎన్నికలు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయంటూ సిటీ సివిల్ కోర్టు ను ఆశ్రయించారు. దీంతో కోర్టు ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరగగా మొత్తం 702 మంది సభ్యుల్లో 394 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రక్రియనంతా చిత్రీకరించి ఆ సీడీలను కోర్టుకు సమర్పించారు. ’మా’ ఎన్నికలపై ఇరువర్గాల వాదనలు విన్న సివిల్ కోర్టు న్యాయస్థానం కళ్యాణ్ ఫిర్యాదును కొట్టివేసింది. దీంతో ‘మా’ అధ్యక్ష ఫలితాల వెల్లడికి మార్గం సుగమం కావడంతో ఎన్నికల అధికారులు శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్ లో ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. ‘మా’ అధ్యక్ష పీఠం రాజేంద్రప్రసాద్ ను వరించింది. రాజేంద్రప్రసాద్ తన ప్రత్యర్ధి జయసుధపై 85 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు పోలయ్యాయి.వీటిలో 237 ఓట్లు రాజేంద్రప్రసాద్ కు, 152 ఓట్లు జయసుధకు పోలయ్యాయి. 85 ఓట్ల తేడాతో రాజేంద్రప్రసాద్ గెలుపొందినట్లు అధికారికంగా ప్రకటించారు. ఉత్తేజ్,శివాజీరాజా,కాదంబరీ కిరణ్ లు రాజేంద్రప్రసాద్ ప్యానెల్ నుంచి గెలుపొందారు.దీంతో ఆయన వర్గీయులు ఫిల్మ్ ఛాంబర్ సంబరాలు చేసుకున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates