Radio LIVE


Breaking News

Friday, 17 April 2015

ఫేస్ బుక్ లో ఫోటోలు..ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలిక

ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో మైనర్ బాలిక ఫోటోలు పెట్టడంతో ఆ బాలిక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒడిశాలోని కటక్ లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కటక్ జిల్లాలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలిక స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువకుడు రహస్యంగా ఫోటోలు తీసి ఆ ఫోటోలతో ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. అలాగే వాటిని తన స్నేహితులకు చూపించి అనంతరం వాటిని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి విషయాన్ని గ్రామ పెద్దల ముందు ఉంచాడు. ఆ యువకుడిని బాలికను వివాహం చేసుకోవాల్సిందిగా పంచాయతి పెద్దలు చెప్పగా ఆ యువకుడు అంగీకరించలేదు. ఈ మొత్తం వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక విషం తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates