Radio LIVE


Breaking News

Tuesday, 14 April 2015

ప్రపంచాన్ని భయపెడ్తున్న చైనా కదలికలు : ఫిలిప్పీన్స్

ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురి చేసే విధంగా దక్షిణ చైనా సముద్రంలో చైనా కదలికలు ఉన్నయని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు బెనిగ్నో అక్వినో ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రపు హక్కులకు సంబంధించి చైనా పొరుగు దేశాలతో యుద్ధం చేయదనే నమ్ముతున్నానని,అయితే దానికి అవకాశం కూడా ఉందని, దక్షిణ చైనా సముద్రంలో అధిక భాగాన్ని చైనా తనదిగా క్లెయిమ్ చేస్తోందని బెనిగ్నో అన్నారు.
1940ల నుంచి చైనా దక్షిణ చైనా సముద్రంలోని నైన్ డాష్ లైన్ పరిధిలోని ప్రాంతమంతా తన సార్వభౌమాధికారం కిందకే వస్తోందని భావిస్తున్న విషయం తెలిసిందే. ఆ సముద్ర ఆవృత దేశాల ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోకి చైనా తనదిగా చెప్పుకుంటున్న భాగం చొచ్చుకొని పోవడం గమనార్హం.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates