గర్భనిరోధక మాత్రలు వాడటం వలన మెదడు పనితీరులో మార్పులు చోటు చేసుకుంటాయని యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
తరచూ స్త్రీలు ఈ పిల్స్ ను వాడటం వలన అందులో ఉండే సింథటిక్ హార్మోన్ల వల్ల దేహంలోని సహజసిద్దమైన హార్మోన్ల పనితీరు క్షీణిస్తుందని లాస్ ఏంజెల్స్ లోని యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
వీరు 90 మంది మహిళలపై ఈ అంశంపై పరిశోధనలు జరిపి నిర్ధారించారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్న వారిలో మెదడులోని బావోద్వేగాలను నియంత్రణకు కేంద్రంగా పనిచేసే లాటరల్ ఆర్బిగోఫ్రాంటెక్స్ భాగం, ఆలోచనలకు కేంద్రంగా పనిచేసే పోస్టిరియర్ సిగులేట్ కార్టెక్స్ భాగాల పరిమాణం పెరిగి మెదడు పనితీరు క్షీణదశకు చేరుకునే అవకాశమున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ అవకాశం ఫిల్స్ వాడని మహిళల్లో తక్కువగా ఉన్నట్లు వారు వెల్లడించారు.

No comments:
Post a Comment