Radio LIVE


Breaking News

Thursday, 16 April 2015

రేప్ బాధితురాలి గర్భస్రావానికి నో చెప్పిన గుజరాత్ హైకోర్ట్

ఓ 24 సంవత్సరాల యువతి కసాయిల బారిన పడి 6 నెలలు వారి నిర్బంధంలో ఉన్నందుకు ఆ యువతికి గర్భం వచ్చింది. వారి నిర్బంధం నుంచి తప్పించుకుని వచ్చి గర్భస్రావానికి అనుమతించాలని కోరగా గుజరాత్ హైకోర్ట్ నిరాకరించింది. వివరాలు : ఓ 24 సంవత్సరాల యువతి 28 వారాల గర్భంతో కోర్టుకు వెళ్లి తనకు గర్భస్రావానికి చేయించుకోవడానికి అనుమతించాల్సిందిగా కోరగా..కోర్టు దీనికి నిరాకరిస్తూ 20 వారాలకు మించి ఉన్న గర్భాన్ని తొలగించడానికి చట్టం అనుమతించదని పేర్కొంది ‘యువతి ధైర్యంగా ముందుకెళ్లాలి. శిశువుకు జన్మనియాల్సిందే అని కోర్టు తీర్పునిచ్చింది. గర్భిణి శిశువునకు జన్మనిచ్చే వరకు ప్రభుత్వం తరపున ఆమె బాగోగులు చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఆమె భవిష్యత్ లో ఎన్ని అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుందో కోర్టుకు తెలుసు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.యువతి రేపిస్టుల చేతిలో 6 నెలలపాటు ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. యువతి బోటడ్ జిల్లా వాసి. భర్త ఇద్దరు పిల్లలతో కలిసి సూరత్ లో నివసిస్తుంది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates