ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్రము మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపధ్యంలో దీని ప్రభావం మరో 3రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని,పలు ప్రాంతాల్లో వడగండ్లు పడే అవకాశం ఉందని, అక్కడక్కడ ఉరుములు,మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ కు చెందినవాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
క్యుములో నింబస్ మేఘాలు తెలంగాణ రాష్ట్రాన్ని కమ్మేయడం వల్ల రాష్ట్రమంతటా భారి వర్షాలు కురుస్తాయని వారు అన్నారు.నల్గోండ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారి వర్షాలు కురుస్తున్నాయి.
నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్,వరంగల్ జిల్లాలో భారీ వర్షం కారణంగా వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నది.IKP కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.మామిడి కాయలు నేలరాలాయి.
హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది.పలు చోట్ల నాలాలు పొంగిపోర్లరుతున్నాయి.ఈదురుగాలులకు బాగ్లింగంపల్లిలో బస్ షెల్టర్ నేలమట్టమైంది. వర్షాల కారణంగా సెంట్రల్ ఎమర్జెన్సీ, సిర్కిల్ కార్యాలయాలను అప్రమత్తం చేసినట్లు GHMC కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రధాన కూడళ్లలో పరిస్థితిని బృందాలు పర్యవేక్షిస్తున్నాయని, స్థానిక సమస్యలపై 040-21111111 నంబర్ కు ఫోన్ చేయాల్సిందిగా ప్రజలకు ఆయన సూచించారు.

No comments:
Post a Comment